రైతును తొక్కి చంపేసిన ఏనుగు..

నవతెలంగాణ – అమరావతి: చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఒంటరి ఏగును హల్ చల్ చేసింది. పీకే తండా వద్ద రైతును తొక్కి చంపేసింది. దిగువ తండా నుంచి వెళ్తున్న కన్నా నాయక్‌పై ఏనుగు దాడి చేసింది. అనంతరం తొక్కి చంపింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం సమీపంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, తరచూ తమ గ్రామాల్లోకి ఏనుగులు వస్తున్నాయని, పంట పొలాలను నాశం చేస్తున్నాయని, ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని, కానీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. తాజాగా రైతు కన్నా నాయక్ ను ఏనుగు తొక్కి చంపడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగు ఎప్పుడు తమ గ్రామంపై పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు తమ పంట పొలాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Spread the love