డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన లారీ…

నవతెలంగాణ – నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై (NH-65) వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానుకు తరలించారు. కాగా, లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో లారీని క్రేన్‌ సహాయంతో తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love