కాకరకాయతో లాభాలెన్నో…

With curry Many benefits...రుచిలో చేదైనా.. శరీరానికి పోషకాలు అందించటంలో కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఖనిజ లవణాలూ, విటమిన్లూ, పీచూ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించటంలో వీటి పాత్ర ఎంతో కీలకం. కాకరకాయను మన ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అనేక ఆరోగ్యకరమైన లాభాలున్నాయి. ఆస్తమాకు ఆయుర్వేద ఔషధంగా ఇది పనిచేస్తుంది. శరీరానికి ఇమ్యూనిటీని అందిస్తుంది. కాకరను తరచూ తినటం వల్ల చర్మ, రక్త సమస్యలు దూరమవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్‌, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఏ కాలంలోనైనా వీటిని తీసుకోవచ్చు. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించటానికి, బరువు తగ్గటానికి దోహదపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను దూరం చేస్తాయి. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారి ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి. ఈ కాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చూస్తాయి. వీటిలో కేలరీలు, కొవ్వు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియాన్ని గ్రహించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వీటిల్లోని ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ హృద్రోగాల నుంచి దూరం చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మూత్రాశయ పరితీరును మెరుగుపరుస్తాయి. తిన్నవెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలివేయదు. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తమ ఆహార ప్రణాళికలో చేర్చుకోవచ్చు. రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుంది. ఈ కూరగాయలో ఉండే బీమా కెరోటిన్‌, విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగుపరుస్తాయి. అందువల్ల ప్రతిఒక్కరూ కాయరకాయలను తినటం ఎంతో మంచిది.

Spread the love