కుటుంబ విలువల్ని గుర్తు చేసే సినిమా

A movie that reminds us of family valuesభారతీయ సినిమాటోగ్రాఫర్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు కేయూ మోహనన్‌. ‘డాన్‌, తలాష్‌, అందధూన్‌’ వంటి బాలీవుడ్‌ సూపర్‌ హిట్స్‌తో పాటు తెలుగులో మహేశ్‌ బాబు ‘మహర్షి’ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం హీరో విజరు దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతల్ని నిర్వర్తించారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్‌ పెట్ల దర్శకత్వం వహించారు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5వ తేదీన గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో కేయూ మోహనన్‌ మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
ఈ సినిమా అనేది ఒక బ్యూటిఫుల్‌ మూవీ. ఒక మిడిల్‌ క్లాస్‌ మ్యాన్‌ కథ. అతను ఫ్యామిలీ కోసం ఏం చేశాడు అనేది గుడ్‌ మెసేజ్‌తో ఉంటుంది. కాలనీ సెట్‌లో షూటింగ్‌ చేశాం. కథ, క్యారెక్టర్స్‌ ఎంత నేచురల్‌గా ఉన్నాయో దాన్నే రిఫ్లెక్ట్‌ చేసేలా విజువల్స్‌ తెరకెక్కించాను. డ్రోన్‌ షాట్స్‌ ఉండవు. లైటింగ్‌ కూడా సహజంగా చేశాం. ఒక మిడిల్‌ క్లాస్‌ ఇల్లు తెరపై చూస్తుంటే..ఇది మన ఇల్లులా ఉంది అనిపిస్తుంది. దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమా నేపథ్యాన్ని సింపుల్‌ సెటప్‌లో క్రియేట్‌ చేశాడు. విజరు, మృణాల్‌ నాకు ఎంతో సపోర్ట్‌ చేశారు.
మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్‌ గురించి చెప్పే సినిమా ఇది. ఇండియా మొత్తం న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌గా మారిపోయాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండటం అనేది జరగడం లేదు. ఇలాంటి టైమ్‌లో మన ఓల్డ్‌ ఫ్యామిలీ వ్యాల్యూస్‌ గురించి డిస్కస్‌ చేసే సినిమా ఇది. దానితో పాటు మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. ఎస్వీసీ సంస్థలో గతంలో పనిచేశాను. దిల్‌ రాజు సంస్థలో పనిచేయడం హ్యాపీగా ఉంది. నా కూతురు మాళవిక మోహనన్‌ తనకు తానుగా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు నేను ఏ సినిమాకూ రికమెండ్‌ చేయలేదు. విక్రమ్‌తో పా రంజిత్‌ రూపొందించిన ‘తంగలాన్‌’ మూవీ మాళవికకు మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నా.

Spread the love