నిధుల కొరత రాకూడదు

– ఆర్థిక పరిస్థితిపై సమీక్షలో ఏపీ సీఎం ఆదేశం
అమరావతి : రాష్ట్ర ఖజానాకు నిధుల కొరత ఎటువంటి పరిస్థితుల్లోనూ రాకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వివిధ ఆదాయ వనరుల శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధుల కొరత రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వస్తున్న ఆదాయం, పలు కార్యక్రమాలకు చేస్తున్న వ్యయంపై అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ, మద్యం శాఖల ద్వారా వచ్చే ఆదాయంపై లోతుగా చర్చిరచినట్లు తెలిసిరది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాలకు నిధుల కొరత రాకుండా చూడటానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు. ఇది ఎన్నికల ఏడాదన్న అంశాన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పినట్లు తెలిసింది. అనంతరం ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు పూర్తయిన సందర్భంగా ఆదాయ, వ్యయాలపై కూడా అధికారులు కూడా ముఖ్యమంత్రికి పవర్‌ పాయిరట్‌ ప్రజెరటేషన్‌ ద్వారా వివరిరచారు. కేంద్రం ద్వారా వస్తున్న నిధులు, రిజర్వ్‌బ్యారకు నురచి ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా సేకరిరచిన రుణాలు కలిపి మొత్తం ఆదాయ పరిస్థితులను వివరించారు. అయితే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు తేలాయని సమాచారం. ఈ లోటును ఆఫ్‌ బడ్జెట్‌ బారోయిరగ్స్‌ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంలో సైతం ఎన్నికల ఏడాది అంశాన్ని సిఎం ప్రస్తావించినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చాలని చెప్పారు. . ఇదే సమయంలో మద్యం అమ్మకాలు, తద్వారా సమకూరుతున్న ఆదాయంపైనా ఆ శాఖ అధికారులు వివరిరచారు. మద్యం అమ్మకాలు తగ్గినట్లు తేలినా, ఆదాయం మాత్రం పెరిగిరదని అబ్కారీ అధికారులు వివరిరచారు.కేంద్రం నురచి రావాల్సిన నిధులపై కూడా ముఖ్యమంత్రి వాకబు చేసినట్లు తెలిసిరది. ఏయే పథకాలకు ఎరత రావాల్సి ఉరది, అరదులో ఇప్పటివరకు వచ్చిన నిధులు ఎరత అన్నది ఆర్థిక శాఖ అధికారులు వివరిరచారు. ఇరకా రావాల్సిన నిధులపై ఫోకస్‌ పెట్టాలని ముఖ్యమంత్రి సూచిరచారు. ఈ భేటీలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love