శ్రీరామ శోభాయాత్రలో దొంగల చేతివాటం..

నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీరామ నవమి సందర్భంగా ఎమ్మెల్యే రాజా‌సింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి నగరం నలుమూలల నుంచి బీజేపీ శ్రేణలు, రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ట అనంతరం వచ్చిన మొదటి శ్రీరామ నవమి కావడంతో శోభాయత్ర కాషాయ జెండాలతో కదం తొక్కింది. ఈ క్రమంలోనే శోభాయాత్రలో జేబు దొంగలు దూరి తమ ప్రతాపాన్ని చూపారు. పలువురి భక్తుల ఖరీదైన సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలను తస్కరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఓ బ్రాస్‌లెట్ చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితులంతా కలిసి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Spread the love