గ్రామదేవతలకు పూజలు నిర్వహించే వారిని పూజారులుగా గుర్తించాలి

– బైండ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలకర యాలాద్రి

నవతెలంగాణ – నెల్లికుదురు
గ్రామాలలో గ్రామ దేవతలైన ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, దేవతలను పూజలు నిర్వహించే వారిని పూజారులుగా ప్రభుత్వం గుర్తించి గౌరవేతల అందివ్వాలని బైండ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిలకర యాలాద్రి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన బైండ్ల కులస్తుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎన్నో రకాలైన గ్రామదేవతలు ఉంటారని వారిని బైల కులస్తులు మాత్రమే పూజ నిర్వహిస్తారని అన్నారు. అలా పూజలు నిర్వహించే వారిని ప్రభుత్వం పూజారులుగా గుర్తించి గౌరవేతను ఇచ్చి ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా బైండ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అధికంగా నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయాలని తెలిపారు. మా బైండ్ల కులస్తులు పేదరికంలో ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు జీలకర్ర యాకయ్య జిలకర వీరన్న తో పాటు కొంతమంది పాల్గొన్నారు.
Spread the love