యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికై గిరిజన శక్తి రౌండ్ టేబుల్ సమావేశం

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ గిరిజన శక్తి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం  రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.సంఘం అధ్యక్షుడు శ్రీను నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులతో కలిసి చర్చించామని, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయంలో సరైన పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.  అదేవిధంగా  హెల్త్ సెంటర్లో 24గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండాలని, కొత్తగా మహిళలకు నూతన  వసతి గృహం నిర్మించాలని తదితర  డిమాండ్లను సమావేశంలో తీర్మానించమని వివరించారు. గిరిజన శక్తి జనరల్ సెక్రెటరీ సాగర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను తగు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో నరేష్ నాయక్, నిఖిల్ నాయక్, శివ నాయక్, సంజయ్ నాయక్, కృష్ణ ,శ్రీకాంత్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love