థ్రిల్‌ చేసే సినిమా

Thrilling movie‘బాహుబలి’ ప్రభాకర్‌ ప్రధాన పాత్రలో రావుల రమేష్‌ క్రియేషన్స్‌ పతాకంపై పాలిక్‌ దర్శకత్వంలో రావుల రమేష్‌ నిర్మిస్తున్న చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబం ధించిన మోషన్‌ పోస్టర్‌, చిత్రంలోని మొదటి లిరికల్‌ వీడియోను ఆదివారం నిర్మాత రాజ్‌ కందుకూరి లాంచ్‌ చేశారు. ‘సుర సుర సుర అసుర సురసుర … హర హర హర అతి భయంకరా…’ అంటూ సాగే ఈ పాటను సురేష్‌ గంగుల రచించగా, జాన్‌ భూషణ్‌ స్వరపరిచారు. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ, ‘టైటిల్‌తో పాటు నేను లాంచ్‌ చేసిన సాంగ్‌ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. పాట చూసిన తర్వాత థ్రిల్లర్‌ కథ అని అర్థమవుతోంది. ‘బాహుబలి’ ప్రభాకర్‌ గెటప్‌, క్యారెక్టర్‌ చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను చూసిన పాట, మోషన్‌ పోస్టర్‌తో దర్శకుడు పాలిక్‌ ప్రతిభ ఏంటో కనబడుతోంది. జాన్‌ భూషన్‌ సంగీతం వినసొంపుగా ఉంది. ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ కావాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘దర్శకుడు పాలిక్‌ పక్కా ప్లానింగ్‌తో, ప్రభాకర్‌ సపోర్ట్‌తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. త్వరలో చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తాం’ అని నిర్మాత రావుల రమేష్‌ అన్నారు. దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ,’జాన్‌ భూషన్‌ చక్కటి బాణీలు ఇవ్వగా, అద్భుతమైన సాహిత్యాన్ని ‘బొంబాయి పోతావా రాజా’ ఫేమ్‌ సురేష్‌ గంగుల అందించారు’ అని తెలిపారు.

Spread the love