మూడ్రోజుల్లో 98 మంది మతి
యూపీ, బీహార్‌లలో దారుణం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ, బిహార్‌లో గడిచిన మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా 98మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాదిన వడగాల్పుల ప్రభావం అధికంగా ఉన్నది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవు తున్నారు. గత మూడ్రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతున్నది. మరోవైపు బీహార్‌లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.