కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

నవతెలంగాణ- నారాయణపేట టౌన్‌
జిల్లా కేంద్రంలో శనివారం పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని, వెటర్నరీ కార్యాలయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని పశువులకు చికిత్సలు నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమ యపాలన పాటించాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. పశువుల కు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో పెట్టాలని సూచిం చారు. అలాగే జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని, మత్స్యశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యాలయంలో గైర్‌ హాజరైన వారి వివరాలను, కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య లు తప్పవని జిల్లా కలెక్టర్‌ హెచ్చరించారు.

Spread the love