యూనివర్సల్‌ కాన్సెప్ట్‌

Universal conceptఅన్నపూర్ణ స్టూడియోస్‌, చారు బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలిసి కన్నడ బ్లాక్‌ బస్టర్‌ ‘హాస్టల్‌ హుడుగారు బేకగిద్దరే’ను తెలుగులో ‘బార్సు హాస్టల్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు. నితిన్‌ కష్ణమూర్తి
ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు.
ఈ సినిమా ఈనెల 26న విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు నితిన్‌ కష్ణమూర్తి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
కన్నడలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ‘బార్సు హాస్టల్‌’గా తెలుగులో విడుద లౌతుంది. ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి ప్రత్యేకమైన కారణం ఒక్కటే ఈ కథకు యూనివర్సల్‌ అప్పీల్‌ వుంది. హాస్టల్స్‌ ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. ఇందులో ఉన్న పాత్రలు కూడా అందరూ రిలేట్‌ చేసుకునేలా ఉంటాయి.
డబ్బింగ్‌ కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా సహజంగా చేశాం. ఇందులో రమ్య చేసిన సీన్స్‌ని రష్మీతో రీ షూట్‌ చేశాం. ఎందుకంటే తెలుగులో బాగా పాపులర్‌ నటితో వీటిని చేయిస్తేనే ఆ మాజా వస్తుంది. అందుకే రష్మీని ఎంపిక చేసుకున్నాం. ఆమె ఈ పాత్రని చక్కగా పోషించారు. చాలా హాట్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా కనిపిస్తారు. తరుణ్‌ భాస్కర్‌, రిషబ్‌ శెట్టి పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో దాదాపు ఐదు వందలకు పైగా నటీనటులు కనిపిస్తారు. 120 పాత్రలకు డైలాగులు ఉంటాయి. నేను కూడా ఒక పాత్ర చేశాను. ప్రతి పాత్ర మన పక్కింటి కుర్రాడిలా ఉంటుంది. ‘కాంతార, విరూపాక్ష’ చిత్రాలతో ఆకట్టుకున్న జనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి మ్యూజిక్‌ చేశారు. తెలుగులో సినిమా అవకాశం వస్తే బాలకష్ణతో సినిమా చేయడానికి ఇష్టపడతాను.

Spread the love