విద్యుత్‌ విజయాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సృష్టే

మంత్రి జగదీష్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యుత్‌ విజయాలు ముఖ్య మంత్రి కేసీఆర్‌ సృష్టేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీష్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సోమ వారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో విద్యుత్‌ విజయాలపై నిర్వహించిన విద్యుత్‌ ప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాలంలో ఉద్యమించిన వారే…నేడు హారతులు పడుతున్నారని చెప్పారు. విద్యుత్‌ విజయాలకు వినియోగదా రులే న్యాయనిర్ణేతలని అన్నారు. తెలం గాణ ఏర్పడితే చీకట్లు కమ్ముకుంటా యన్న సీమాంధ్ర పాలకుల అపోహ లను పటాపంచలు చేశారని మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో రెడ్కో చైర్మన్‌ సతీష్‌ రెడ్డి, ఇంధన శాఖా ప్రత్యేక కార్యదర్శి సునీల్‌ శర్మ తదితరులు మాట్లాడారు.

 

Spread the love