తగ్గిన సర్వీస్‌ పీఎంఐ

న్యూఢిల్లీ : భారత సర్వీస్‌ సెక్టార్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ)లో తగ్గుదల చోటు చేసుకుంది. ఈ సూచీ గడిచిన మేలో 61.2కు తగ్గింది. ఇంతక్రితం నెలలో 62.0గా చోటు చేసుకుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి డిమాండ్‌పై ప్రభావం చూపిందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా సర్వీస్‌ పీఎంఐ తెలిపింది. గడిచిన 12 ఏండ్లుగా ఈ సూచీ 50పైనే నమోదవుతోంది. 50కి దిగువన నమోదయితే పతనాన్ని చవి చూస్తున్నట్లుగా భావిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు సర్వీస్‌ ప్రొవైడర్లకు సవాలుగా మారుతున్నా యని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ మార్కెట్‌ ఇంటిలిజెన్స్‌లోని ఎకనామిక్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ పొలియానా డి లిమా పేర్కొన్నారు. టూరిజం, ఆతిథ్యం, విద్యా, వైద్యం తదితర రంగాలు సర్వీస్‌ సెక్టార్‌లోకి వస్తాయి.

Spread the love