బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

– హుస్నాబాద్ లో ఒక్కరికి రూ 50 వేల జరిమాన

– సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి 
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన  వ్యక్తికి రూ.50 వేల జరిమాన తాహాసిల్దార్ విధించినట్లు సిద్దిపేట సిపి  శ్వేతా రెడ్డి తెలిపారు. హుస్నాబాద్  పట్టణానికి చెందిన  జక్కని సాగర్ బెల్ట్ షాప్ నిర్వహించవద్దని తాహాసిల్దార్ ఎదుట ఇటీవల బైండోవర్ చేసిన ఎన్నికల కోడ్  ఉల్లంఘించి ఇంటి వద్ద  అక్రమంగా బెల్ట్ షాప్  నడుపుచుండగా హుస్నాబాద్ ఎస్ఐ మహేష్ పట్టుకొని కేసు నమోదు చేసి హుస్నాబాద్ తహసిల్దార్ ముందు బైండ్ఓవర్ చేయగా విచారణ జరిపి రూ 50 వేల రూపాయల జరిమానా, లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని తెలుపగా, అందుకు సదరు వ్యక్తి రూ .50 వేల రూపాయల జరిమానా చెల్లించాడు. బైండోవర్ చేసిన వ్యక్తులు సంవత్సరం వరకు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న నేరస్తులు మరియు చెడు ప్రవర్తన గలవారు  రౌడీలు, కేడీలు, డిసీలు, సస్పెక్ట్ మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు.  వివిధ కేసులలో బైండోవర్  చేసిన వ్యక్తులు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే  చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత  హెచ్చరించారు.
Spread the love