39వ రోజుకు వీఓఏల నిరవధిక సమ్మె

నవతెలంగాణ-సదాశివపేట
ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె గురువారం నాటికి 39వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా వారు నిరవధిక సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సమ్మెలో భాగంగా గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీ ల్దార్‌ చక్రవర్తికి వినతిత్రం అందజేశారు. అనంతరం ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వివోఏల పట్ల సవ తి తల్లి ప్రేమ చూపిస్తున్నదన్నారు. గత 39 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దుర్మార్గమన్నారు. 20 ఏండ్లుగా విధులు నిర్వహి స్తున్నా వా రికి కనీసం వేతనం అమలు కావడం లేదన్నారు. అంతే కాకుండా ఇప్పటివరకు ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్య లు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల సమ్మెను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో ఐకెపి నాయకులు ఆంజనేయులు రోషన్‌, మోయిజ, జ్యోతి, లక్ష్మి,సరిత, సత్యమ్మ, రాజమ్మ పాల్గొన్నారు.
జోగిపేట : వీవోఏల సమ్మెకు అందోలు మండల సమాఖ్య మాజీ అధ్యక్షురాలు మొల్ల ఫాతి యా బేగం మద్దతు తెలిపి మాట్లాడారు. వారిని సెర్ప్‌ ఉద్యో గులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు వీఎల్‌ఆర్‌, అభయహస్తం, డబ్బులు చెల్లిం చాలని, సభ్యులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని కోరా రు. ఈ కార్యక్ర మంలో ఐకేపీ వీఓఏల మండలాధ్యక్షులు మల్లయ్య, కార్య దర్శి ఆంజనే యులు, కోశాధికారి విజయ, వీఓఏలు అబ్ధుల్‌ ఫహీం, రేణుక మానస బి.అశోక్‌, లాయక్‌ అలీ, ఎం.అశోక్‌, లక్ష్మణ్‌, సుప్రియ చంద్రిక స్వప్న భాగయ్య, వీరమని, సునీత తదితరులు పాల్గొన్నారు.

Spread the love