ఆటతో మా బతుకులు మార్చుకుంటాం

జె.శక్తీశ్వరి…
యువ లాయర్‌, ఫుట్‌ బాల్‌ కోచ్‌. ఆమె కమ్యూనిటీకి ఒక గేమ్‌ఛేంజర్‌. ఉత్తర చెన్నైలోని వ్యాసర్‌పాడి మురికివాడకు చెందిన పిల్లలను గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ సామాజిక మార్పు కోసం కషి చేస్తున్నది. వారిని మెరుగైన ఆటగాళ్లుగా తయారు చేసేందుకు అవసరమైన శిక్షణనిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

ఉత్తర చెన్నైలోని వ్యాసర్‌పాడిలోని 20 మురికివాడలకు చెందిన 200 మంది పిల్లలు ప్రతిరోజూ తెల్లవారుజామున నిద్రలేచి, ట్రాక్‌ ప్యాంట్‌లు, స్నీకర్లను మార్చుకుంటారు. గజిబిజిగా, చిందర వందరగా ఉన్న తమ ఇండ్ల నుండి ఫుట్‌బాల్‌ ఆడటానికి బయటకు వస్తారు. వారిలోని బద్ధకం మాత్రం స్లమ్‌ చిల్డ్రన్‌ స్పోర్ట్స్‌ టాలెంట్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఫుట్‌బాల్‌ టర్ఫ్‌ గేట్‌లను దాటదు. ఇక్కడ వారి కోచ్‌ జె. శక్తీశ్వరి రోజు విడిచి రోజు వారి కోసం ఎదురు చూస్తుంటుంది.
మొదటి మహిళ...
”ఈ పిల్లలలో ఎవరైనా రేపటి రోజు జాతీయ ఛాంపి యన్‌ కావచ్చు. కానీ, అంతకు ముందు వారు వంశ పారంపర్యంగా అణచివేయబడిన వారి కుటుంబాల్లో మొదటి తరం విద్యావంతులు. ప్రశ్నించే పౌరులుగా మారడా నికి ఇక్కడకు వస్తున్నారు” అంటూ శక్తీశ్వరి తన ప్రత్యక్ష అనుభవం నుండి మాట్లా డుతోంది. దినసరి కూలీకి పుట్టిన ఆరుగురు సంతానంలో ఐదవ సంతానంగా, 30 ఏండ్ల ఆమె వ్యాసరపాడిలోని పక్క సందుల్లో పెరిగింది. తన కుటుంబంలో బి.కాం పూర్తి చేసిన మొదటి మహిళ. ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తోంది.
జీవితాల్లో మార్పు కోసం…
2011లో శక్తీశ్వరి హోమ్‌లెస్‌ వరల్డ్‌కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. పారిస్‌లో జరిగిన అసోసియేషన్‌ ఫుట్‌బాల్‌ క్రీడ ద్వారా నిరాశ్రయుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని భావించింది. తన అక్కలు చదువు మానేసినా ఆమె మాత్రం తన పాఠశాలను కొనసాగించడానికి సాయంత్రం చేపల మార్కెట్‌లో పని చేసి కుటుంబానికి తోడ్పాటు అందించింది. అలాంటి శక్తీశ్వరి జీవితం ఈరోజు ఆమె చిన్ననాటి పరిస్థితులకు భిన్నంగా ఉంది. ”10వ తరగతి ఫెయిల్‌ అయిన తర్వాత నా అక్కలను పాఠశాలకు పంపడంలో అర్థం లేదని మా నాన్న నిర్ణయించుకున్నారు. ఇది నాకు కూడా జరిగి ఉండవచ్చు. కానీ ఫుట్‌బాల్‌ కోచ్‌ తంగరాజ్‌ చొరవ వల్ల నాకలా కాలేదు” ఆమె చెప్పింది. 1980లలో వైయస్సార్‌పాడికి కరెంటు, నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. మా పొరుగు ప్రాంతం కూడా నేరాలు, మాదకద్రవ్యాలతో నిండి వుండేది. ఇటువంటి పరిస్థితుల్లో నా కోచ్‌ ఎన్‌. తంగరాజ్‌, ఎన్‌. ఉమాపతి అడుగడుగునా అణచివేతతో పోరాడుతూ దళిత పిల్లలకు క్రీడలు, విద్యను పరిచయం చేశారు” చెప్పింది శక్తీశ్వరి.
బాలికలపై ప్రత్యేక శ్రద్ధ…
”బ్రిటీష్‌ వారి కాలం నుండి ఇక్కడి ప్రజలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. ఆట కోసం ఎక్కువ మంది సహచరులు అవసరమైనప్పుడు మా పురుషులు వారితో చేరారు. చివరికి అది మా గుర్తింపుతో పాటు మా జీవితంలో ఒక భాగమైంది” అని తంగ రాజ్‌ చెప్పారు. తంగరాజ్‌, ఉమాపతి కలిసి 2000లో స్లమ్‌ చిల్డ్రన్‌ స్పోర్ట్స్‌ టాలెంట్‌ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీని ఒక చీ+ఉగా నమోదు చేసుకున్నారు. బాలికలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పిల్లలకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. వారు ఒక ట్యూషన్‌ సెంటర్‌ను కూడా మొదలుపెట్టారు. ఇక్కడ భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, కోచ్‌లు, అధికారులు ఉపాధ్యాయులుగా స్వచ్ఛందంగా పని చేస్తు న్నారు. 2015లో ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ నుండి లైసెన్స్‌ పొందినప్పటి నుండి శక్తీశ్వరి 12 ఏండ్లలోపు అబ్బాయిలకు, 18 ఏండ్లలోపు బాలికలకు శిక్షణ ఇవ్వడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. అదే సమయంలో వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా దష్టి పెట్టింది.
నేరాలు చేసేవారిగా…
”నేను పాఠశాల విద్యను కొనసాగించాను. ఫుట్‌బాల్‌తో ప్రేమలో పడ్డాను” ఒంటరిగా పెరిగిన ఇరుధయరాజ్‌ అంటున్నాడు. ఈ ఏడాది అతను బీకామ్‌లో చేరాడు. 1990వ దశకం చివరిలో తంగరాజ్‌, ఉమాపతి ప్రారంభించిన ఉద్యమంలో ఈ రకమైన అభివద్ధి ఉంది. ఇది క్రీడల ఆధారంగా విద్యా వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. తమ లక్ష్యాన్ని చేర్చడానికి పిల్లలకు కోచ్‌లు మార్గదర్శకులుగా నిలిచి రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తారు. ఈ పిల్లల్లో చాలా మంది ఒంటరి తల్లిదండ్రులు, ఆర్థిక స్తోమత లేని కుటుంబాల్లో, అనాథలుగా పెరిగారు. ఏండ్ల తరబడి వ్యాసర్‌పాడి పిల్లలు చదువు లేకుండా నేరాలు చేసే వారిగా పేరుగాంచారు. ”ఇక్కడ ప్రజలు గమనించడంలో విఫలమైన విషయం ఏమిటంటే పిల్లలు వెనుకబడి ఉన్నారు. ఎప్పుడూ తప్పు చేయరు. ఏండ్లుగా వారికి అందుబాటులో ఉన్న ఏకైక పాఠశాలకు మూడు నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రమాదాలకు గురయ్యే రైల్వే ట్రాక్‌ అడ్డంగా ఉంది” అని తంగరాజ్‌ చెప్పారు.
క్రీడ నమ్మకాన్ని పెంచుతుంది…
అటువంటి పాఠశాలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడం సురక్షితంగా భావించలేదు. శారీరక శ్రమ చేసిన తర్వాత తండ్రులు మద్యం తాగేవారు. దాంతో ఆ కుటుంబాలు ఎప్పుడూ పేదరికంలోనే వుండేవి. అటువంటి పరిస్థితుల్లో ఫుట్‌బాల్‌ ఆ పిల్లలకు పాఠశాలను పూర్తి చేయడానికి ఒక సాధనం, ప్రేరణగా మారింది. ఇప్పుడు వారు క్రీడా కోటాలో కోరుకున్న కళాశాలలో చదువుకోవచ్చు. ”క్రీడలు మిమ్మల్ని మంచి దష్టిలో ఉంచుతాయి. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా, గ్రహణశక్తిగా, అత్యంత నమ్మకంగా తయారు చేస్తుంది. పిల్లలు మైదానంలో నేర్చుకునే ప్రతిదాని ద్వారా వ్యక్తులుగా తమ పాత్రను నిర్మించుకుంటారు” అని శక్తీశ్వరి చెప్పారు. వివక్ష ప్రతిచోటా జరుగుతుందనడానికి ఆమె నిదర్శనం. ”పాఠశాలలో మా ఉపాధ్యాయులు నన్ను ‘ఆ మత్స్యకార అమ్మాయి’ అని పిలిచేవారు. నేను ఎక్కడ నుండి వచ్చానో అందరికీ తెలుసు. ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సమావేశాలలో మా బందం ఒక అభ్యర్థిని ఎంపిక చేయడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఇతర జట్టుకు (ఆధిపత్య కులాలు) రెండు గంటల్లో తెలిసిపోయేది. కాబట్టి సామాజిక మార్పుకు ఈ క్రీడ ఏకైక మార్గంగా నేను చూస్తున్నాను. ఈ రోజు మా పిల్లలలో 90 శాతం కంటే ఎక్కువ మంది పాఠశాలకు వెళుతున్నారు. కాబట్టి నేను సరైన మార్గంలో ఉన్నానని భావిస్తున్నాను.
చాలా శ్రమించాల్సి వచ్చింది…
పదిహేనేండ్ల జి.ధనుష్‌శ్రీని ఆమె ప్రధానోపాధ్యాయుడు క్రీడలు ఆడాలని మాటలతో వేధించడం ప్రారంభించడంతో కొంతకాలం పాఠశాలకు వెళ్లడం మానేసింది. ”ఇది సాధారణం” అని తంగరాజ్‌ చెప్పారు. ‘మేము వెంటనే పాఠశాలకు వెళ్ళి ఆమెకు శిక్షణ ఇవ్వడానికి ఒక మార్గాన్ని రూపొందించాం. సమస్య ఇప%డు పరిష్కరిం చబడింది’ అని ఆయన అన్నాడు. తమ అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించి ఆడుకోవడానికి వెళుతున్నారనే ఆలోచనల నుండి తల్లిదండ్రులను మార్చడానికి శక్తీశ్వరి చాలా శ్రమించింది. ఆమె అద్భుతమైన ప్రయాణాన్ని చూసిన తల్లిదండ్రులు కూడా క్రీడలు ఒక పరివర్తన శక్తిగా పనిచేస్తాయని, వారి కుమార్తెలను శిక్షణకు పంపేందుకు ఆసక్తి చూపించారు. ”నా టీమ్‌లో అత్యుత్తమ డిఫెన్స్‌ ప్లేయర్‌గా ఎదగాలనుకుంటున్నాను. మా అమ్మకు కూడా ఇదే కావాలి” అని ధనుష్‌శ్రీ చెప్పారు
కొత్త లక్ష్యాలతో…
శక్తీశ్వరి విద్యార్థినులలో ఒకరైన 17 ఏండ్ల ఇళవరసి ఇరుధయరాజ్‌ ఏడాదిన్నర కిందట శిక్షణ ప్రారంభించినప్పటి నుండి కొత్త లక్ష్యాలతో పాఠశాలకు వెళుతున్నట్లు చెప్పింది. ”నేను గతంలో పాఠశాలకు సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఆడటం ప్రారంభించిన తర్వాతనే క్రమశిక్షణతో కూడిన దినచర్య మొదలయింది. ఉదయం పాఠశాలకు వెళ్లి, ఆ రోజు నేర్చుకున్న వాటిని మరోసారి గుర్తుచేసుకునేందుకు ట్యూషన్‌ సెంటర్‌కు వచ్చి రాత్రి 9 గంటలకు ఇంటికి తిరిగి వెళతాను”ఆమె చెప్పింది.

Spread the love