పరేషానేందుకు వయా ?

అసెంబ్లీ ఎన్నికలల్ల అధికార పార్టీ అప్పుడే పరేషాన్‌ కాబట్టే. గదేదో ఇంటెలిజెన్స్‌ రిపోర్టుతోటి ఆ నలుగురు ఇబ్బంది పడబట్టిరి. అందుకే అరోపణలు, విమర్శలు జోరుగ పెంచిర్రాయే. ప్రతిపక్ష నాయకులు, పార్టీల మీద గయ్యిన దుంకబట్టిరి. దమ్మునోడివే గందా, ఎందుకు బుర్రఖరాబుజేసుకోబడితివి. ఏమైతది..నాలుగు సీట్లు అటో, ఇటో అయితై. ఏమైతదీ వయా? ఈ పాలీకాకపోతే మరోపాలి. అధికారం ఏమన్నా పర్మినెంటా ? లేక పెటేంటా ? అప్పుడు అటు ఇటు మారితే గూడ మంచిదే కదా సామి. కాళేశ్వరం నీళ్లలెక్కల్లో తేడాలొంచినయి అనుకుంట. జెర గుస్సా పెరిగిందని అందరూ అనుకోబట్టే ఆళ్లపార్టీలోనే. అప్పుడప్పుడు అసెంబ్లీల కుడివైపు కూడా కుసోవాలే సామి. ఏం ఫీకర్‌ జేయకు. ఇంత పెరుగన్నం తిని తొంగోసామి? ఉంట మల్ల..నాకు ఆకలైతాంది.
– బి.బసవపున్నయ్య

Spread the love