తెలంగాణ దశ మారేనా ?

Will the Telangana phase change?ఎంతోమంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం జూన్‌ 2-2014న ఆవిర్భవించిన విషయం అందరికి తెలి సిందే. ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదం తో రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అంతకుముందు 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో తెలం గాణ అంశం జాతీయ ఎజెండాగా మారడం… 2009లో కేసీఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభించడం.. యావత్‌ తెలం గాణ సమాజం మద్దతు తెలపడం… డిసెంబర్‌ 9న తెలం గాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించడం.. కేసీఆర్‌ దీక్ష విరమిం చడం.. ఇలా అనేక ఒడిదుడుకుల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది.అయితే ఉద్యమనేత కేసీఆర్‌ సీఎం అవ్వడంతో ఇక తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణ దశ మారుతుందని ప్రజా నీకం ఆశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు తోపాటు మల్లన్నసాగర్‌, రంగనాయ కసగర్‌, గౌరవెల్లి, తపాస్‌పల్లి.. తది దర వాటితోపాటు ప్రభుత్వ మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీల నిర్మాణాలతో తెలం గాణ పురోగతి సాధిస్తుందని సంబర పడ్డారు. ఈక్రమంలోనే రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్‌ కిట్లు, ఆసరా పింఛన్లు, కంటి వెలుగు, షాదీ ముబారక్‌ తదితర పథకాలు అమ లు చేశారు. ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమ లకు రాయితీలు.. సింగిల్‌విండో విధానం ద్వారా అనుమతులు, పరిశ్రమలకు రాయితీలతో పాటు సింగిల్‌విండో విధానం ద్వారా అనుమతుల కోసం టీఎస్‌ఐపాస్‌ విధానాలు, హైదరాబాద్‌లో అధిక పెట్టుబడులు తదితర అభివృద్ధి, సంక్షేమ పథకా లతో పదేండ్ల పాటు బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ ఆధ్వ ర్యంలో రాష్ట్ర పాలన సాగింది. కానీ, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్న మాదిరిగా బీఆర్‌ఎస్‌ పాలన గాడి తప్పడం.. చాపకింద నీరులా ప్రజల్లో వ్యతిరేకత అధికంగా రావడం.. లాంటివి అన్నీ జరిగిపోయాయి.
గత పదేండ్లుగా బీఆర్‌ఎస్‌ పాలనలో పునర్విభజన హామీలు అమలుపై కేంద్ర ప్రభుత్వంపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒత్తిడి తేలేకపోయింది. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ గా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్‌ చేసిన ఎత్తుగడలు విఫలమై అసలుకే ఎసరొచ్చి గద్దె దిగాల్సిన దుస్థితి నెలకొంది. తిన డానికి తిండి లేదు కానీ… మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా కేసీ ఆర్‌ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి సంక్షే మ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించారు. దీనికి తోడు ఐటీఆర్‌ ప్రా జెక్టుకు నిధులు మంజూరు, వరంగల్‌ విమానాశ్రయం పునరుద్ధరణ, టెక్స్‌ టైల్‌ పార్కుకు సాయం అదించడంలో, మంజూరైన అన్ని జాతీయ రహదారు లకు నిధులు విడుదల, నీటి పంకాలు ఇలా అన్ని విష యాల్లోనూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ముండి వైఖరి చూ పింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక నినాదం లేవనెత్తడం.. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు తలెత్తడం, లి క్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కూతురు కవితక్క పేరు వెలు గులోకి రావడం.. పేపర్‌ లీకులు కావడం… ఇలా అనేక అవకతవకలు, అవినీతి చేసిందనే ఆరోపణలు బీఆర్‌ఎస్‌ పై రావడంతో రాజకీయాలు శరవేగంగా మారాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023లో బీఆర్‌ఎస్‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక స్వరాష్ట్రంలో రెండు దఫాలు కేసీఆర్‌ సారద్యంలో బీఆర్‌ ఎస్‌ పగ్గాలు చేపట్టగా అనూహ్య రీతిలో మూడోసారి కాంగ్రెస్‌ గెలిచి అధికార పగాలు చేజిక్కిచుకుంది. ఆరుగ్యారెంటీ పథకాలతో ప్రజలను ఆకర్షించి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేసే పనిలో నిమగమైంది. అయితే రాష్ట్ర విభ జన హామీల విషయమై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోడీని ఇటీవల కలిసి సమావేశ మయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, తదితర అంశా లపై చర్చించినట్టు తెలిసింది. అయితే దశాబ్ధ కాలంపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌… రాష్ట్ర విభజన హామీలు అయిన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచింగ్‌, సాగునీటీ ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకు రావడంలో విఫలమైంది.
ప్రస్తుత ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ఆర్థిక పురోగతి పై చర్చించి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత ప్రాజెక్టుకు జాతీ యహోదా కల్పిం చాల్సి ఉంది. ఇందుకు కేంద్రంపై ఒత్తిడి తేవా ల్సిన అవసరం ఉంది. గతంలోనూ కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో భా గంగా ప్రధాని మోడీని కలిసి పునర్విభజన హామీలపై చర్చించి దాదాపు 16 అంశాలు ప్రస్దావించారని సమాచారం. ము ఖ్యంగా వెనకబడిన ప్రాంతాల కోసం, ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజనకు, ప్రతిపాదిత, పెడింగ్‌ రైల్వే ప్రాజె క్టు పనుల పూర్తికి నిధులు చెల్లించా లని నివేదించినట్టు సమాచారం. అయినా ఏ ఒక్కటీ సాధించిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీని కలవడం శుభపరిణామమే. అయితే ఏ మేరకు పునర్విభజన హామీలు అమలయ్యేలా చూస్తారోననే ప్రశ్న తలెత్తుతోంది. గత ప్రభుత్వం మాదిరిగానే మోడీతో చేతులు కలిపి చివరికి చేతులెత్తేస్తే మాత్రం బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పట్టడం తథ్యం.
వేముల క్రాంతికుమార్‌
9676717377

Spread the love