పార్లమెంట్‌లో స్థానంలో గెలుపు తధ్యం

– కాంగ్రెస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి సునీత మహేందర్‌ రెడ్డి
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో తన గెలుపు తధ్యమని మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి సునీత మహేందర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్ల మెంట్‌ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆమె కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రమేష్‌, పార్టీ కార్యకర్తలతో కలిసి కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రచారాన్ని ఉదతం చేశారు. ముందుగా కెేపీహెచ్‌బీ కాలనీలో గల వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంఐజి ఫ్లాట్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని సునీత మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హౌసింగ్‌ బోర్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది అన్నారు. భవిష్యత్తులో ఇందిరమ్మ కమిటీల ద్వారా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంద న్నారు. తనను నాన్‌ లోకల్‌ అంటున్నారని అసలు సిసలై న లోకల్‌ అభ్యర్థిని తానేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో సంక్షేమంలో అభివద్ధిలో పేద ప్రజలకు సేవ చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంటుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని సంక్షేమ పథకాలు ధనవంతులకే చెందాయని పేదల నష్టపోయారన్నారు. అనంతరం నియోజకవర్గ కోఆర్డినేట ర్‌ కోటంరెడ్డి వినరు రెడ్డి అధ్యక్షతన అల్లాపూర్‌ డివిజన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బండి రమేష్‌ మాట్లాడుతూ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేస్తూ పార్టీ విజయానికి కషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీ ఒక్కరిని గుర్తిస్తామన్నారు. ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతుం దన్నారు తద్వారా అభివద్ధి కార్యక్రమాలు చేయించుకోవ డానికి మార్గం సుగమమవుతుందన్నారు. కూకట్‌పల్లిలో 100 పడకల ఆస్పత్రి, కాలేజీ, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరింపబడతాయన్నారు. సర్వే రిపోర్ట్‌లు అన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని లక్ష మెజార్టీ తో ఎంపీ సీటు గెలుస్తామని పేర్కొన్నారు. నియోజక వర్గంలోని అన్ని డివిజన్‌లల్లో కార్యకర్తల సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించారు. సమావేశాల్లో టీపీసీసీ కార్యదర్శి సత్యం శ్రీరంగం, బి బ్లాక్‌ అధ్యక్షుడు తూము వేణు, నియోజకవర్గం మాజీ అధ్యక్షుడు సతీష్‌ రెడ్డి, డివిజన్‌ అధ్యక్షులు కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు

Spread the love