అభ్యర్థులు ఖచ్చితంగా ఖర్చుల వివరాలను నమోదు చేయాలి

నవతెలంగాన-సీటీబ్యూరో
పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌లు వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఖఛ్చితంగా నమోదు చేయాలని జిల్లా వ్యయ పరిశీలకులైన మనోజ్‌ అలోయిస్‌ లక్రా, ధవ్‌ భోళాలు అన్నారు. శుక్రవారం వ్యయ పరిశీల కులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, స్టాటిక్‌ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు, అకౌంటింగ్‌ బృందాలు, షాడో టీమ్‌ లతో కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరములో టీం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని టీంలు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వహించాలని, అనుమానాస్పద ఖాతాలను చెక్‌ చేయాలనీ ఇన్‌ కమ్‌ టాక్స్‌, బ్యాంకు అధికారులను ఆదేశించారు. పరిశీలకులు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, స్టాటిక్‌ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్‌ బృందాలు, అకౌంటింగ్‌ బృందాలు, షాడో టీమ్‌, అకౌంటింగ్‌ టీం సభ్యులు సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించాలని ఆదేశించారు. అకౌంటింగ్‌ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వేషన్‌ రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించిన పార్టీ ప్రచార ఖర్చులు నిర్ణయించిన రేట్ల ప్రకారం నమోదు చేయాలన్నారు. కరపత్రాలు పోస్టర్లు, ఫ్లెక్సీలు ముద్రించి నట్లు, ప్రింటర్‌, ప్రచురణ కర్తలు ఎన్నికల ప్రాతినిధ్యం చట్టం 127ఏ ప్రకారం నిబంధలను పాటించాలని అన్నారు. ఎంసిఎంసి ద్వారా ఎన్నికలలో ప్రకటనలు జిల్లా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సర్టి ఫికేషన్‌ చేయనున్నట్లు ఎన్నికల సంఘం విడుదల చేసిన రేట్ల ప్రకారం ఎన్నికల వ్యయం నమోదు చేయాలన్నారు. ఎంసిఎంసి కమిటీ ద్వారా రోజువారీ దినపత్రికలలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ పై దష్టి సారించాలని, సోషల్‌ మీడియా పై పటిష్ట నిఘా ఉండాలన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా డబ్బు, మద్యం పంపిణి పై ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, ఎస్‌ఎస్‌టీ తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. లావాదేవీల పై పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని టీంలు జాగ్రత్తగా ఉండి పర్మిషన్స్‌ సరిగా ఉందా లేదా అని చెక్‌ చేయాల న్నారు. ఎన్‌ ఓ సి గ్రీవెన్స్‌ టీం ద్వారా సీజ్‌ చేసిన డబ్బు, మద్యం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. సువిధ పోర్టల్‌ లో నమోదు పై రాజకీయ పార్టీల వారికీ అవగాహన కల్పించా మని, ఎంసిసి నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో చెక్‌ పోస్టుల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి అక్రమంగా తరలించే మద్యం, నగదు పై దష్టి పెట్టామని తెలిపారు. అనంతరం సి విజిల్‌ యాప్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950 కాల్‌ సెంటర్‌, గ్రీవెన్స్‌ కమిటీ సెంటర్‌, ఎంసిఎంసి, మీడియా సెంటర్‌లను వ్యయ పరిశీలకులు తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంసిసి నోడల్‌ అధికారి కష్ణ రెడ్డి, ఎక్స్‌ పెండిచర్‌ మానిటరింగ్‌ నోడల్‌ అధికారి రాజేందర్‌ రెడ్డి, నోడల్‌ అధికారులు, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు.

Spread the love