ఐటీ కంపెనీల రాకతో విశ్వనగరంగా హైదరాబాద్‌

– మంత్రి కేటీఆర్‌కు ధన్యావాదాలు :మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐటీ కంపెనీల రాకతో హైదరాబాద్‌ విశ్వనగరంగా మారిందనీ, తొమ్మిదేండ్లలో ఐటీ ఉత్పత్తిలో 31.44 శాతం వద్ధి సాధించిందని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకోసం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయకపోయినా ఐటీ రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. 2023 ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులను తెలంగాణ చేసిందని వివరించారు. 2014లో దేశవ్యాప్తంగా దాదాపు 32.9 లక్షల మందికి కొత్తగా ఐటీ ఉద్యోగులు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9.8శాతం అంటే కేవలం 3.2 లక్షల మందే ఉండేవారని తెలిపారు.
కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్తగా 21 లక్షల కొత్త ఐటీ ఉద్యోగులు ఉంటే తెలంగాణలోనే దాదాపు 27.6 శాతం అంటే 5 లక్షలకుపైనే కొత్త ఉద్యోగులు ఉన్నారని వివరించారు.

Spread the love