దళిత క్రైస్తవులకు రాజకీయ అవసరాలు..

–  లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు సీఎం కేసీఆర్‌ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రానున్న రోజుల్లో సమయం.. సందర్భాన్నిబట్టి మరింత మందికి అవకాశాలు కల్పిస్తారని ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్నారని చెప్పారు. శాంతి సామరస్యాలతోనే రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తుందని ఆమె వివరించారు. సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని (ఈనెల 17) పురస్కరించుకుని బుధవారం సికింద్రాబాద్‌లో టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వ హించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన కవిత మాట్లా డుతూ… దేశంలో గగ్గోలు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో అందుకు భిన్నంగా గత తొమ్మిదేండ్లలో మన రాష్ట్రంలో ఒక్క మతకల్లోలం కూడా చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ శాంతి భద్రత పట్ల చూపుతున్న శ్రద్ధ వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. గంగా జమునా తహసీబ్‌ తరహాలో అందరూ కలిసి మెలిసి జీవించినప్పుడు రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Spread the love