హెచ్‌సీయూలో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయకేతనం

– అధ్యక్షులుగా ప్రజ్వల్‌, ప్రధాన కార్యదర్శిగా కృప మరియజార్జ్‌
– అంబరాన్నంటిన విద్యార్థుల సంబురాలు
– ఏబీవీపీకి భంగపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన
– అన్ని స్థానాలూ కైవసం

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యా లయం(హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) కూటమి విజయకేతనం ఎగురవేసింది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకుని విజ యదుందుభి మోగించింది. హెచ్‌సీయూ ప్రాంగ ణంలో ఎస్‌ఎఫ్‌ఐ జెండా రెపరెప లాడింది. విద్యార్థులు అంబరాన్నం టేలా సంబురాల్లో మునిగిపోయారు.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిందా బాద్‌, ఏబీవీపీ ముర్దాబాద్‌’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. డప్పులు వాయిస్తూ, నినా దాలు చేస్తూ, గెలిచిన అభ్యర్థులకు పూలదండలు వేసి వారిని ఎత్తుకుని క్యాంపస్‌ అంతా తిరిగి గెలుపు ఆనందాన్ని పంచుకున్నారు. మొత్తం 5,133 ఓట్లలో 3,925 మంది విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్‌సీయూ నూతన అధ్యక్షులు ప్రజ్వల్‌, ఉపాధ్యక్షులుగా పృథ్విసాయి, ప్రధాన కార్యదర్శిగా కృప మరియజార్జ్‌, జాయింట్‌ సెక్రెటరీగా కత్తి గణేష్‌, కల్చరల్‌ సెక్రెటరీగా లిఖిత్‌కుమార్‌, స్పోర్ట్స్‌ సెక్రెటరీగా సిహెచ్‌ జయరాజు, ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (ఇంటిగ్రేటెడ్‌) షిఫా మింజ్‌, ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (పీజీ)కి హృతిక్‌ లక్ష్మణ్‌ లలన్‌, ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (రీసెర్చ్‌)కు ఎస్‌ఎస్‌ సుభాషిణీ గెలు పొందారు. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ కనీసం పోటీ ఇవ్వలేక చతికిలపడిపోయింది. మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఎస్‌ఎఫ్‌ఐ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అన్ని రౌండ్లలో నూ ముందంజలో ఉన్నది. అందుకే అన్ని స్థానాల్లోనూ ఎస్‌ఎఫ్‌ఐ- ఏఎస్‌ఏ-డీఎస్‌యూ కూటమి అభ్య ర్థులు ఘన విజయం సాధించారు. అధ్యక్షులుగా పోటీ చేసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి ప్రజ్వల్‌కు 1,838 ఓట్లు, ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,250 ఓట్లొచ్చాయి. 588 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి ఎస్‌ఎఫ్‌ఐ కూటమి నుంచి పృథ్విసాయికి 1,861 ఓట్లు వేశారు. ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,163 ఓట్లు వచ్చాయి. 708 ఓట్ల తేడాతో పృథ్వి సాయి విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శి పోస్టుకు పోటీ చేసిన ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి కృప మరియ జార్జ్‌కు 2,076 ఓట్లు పడ్డాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,185 ఓట్లు వచ్చాయి. కృప మరియ జార్జ్‌ 892 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. స్పోర్ట్స్‌ సెక్రెటరీగా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి సిహెచ్‌ జయరాజుకు 1,544 ఓట్లొచ్చాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థి 1,377 ఓట్లు సంపాదించారు. 177 ఓట్ల తేడాతో జయ రాజు గెలిచారు. జాయింట్‌ సెక్రెటరీ పోస్టుకు ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి కత్తి గణేష్‌కు 1,578 ఓట్లు వచ్చాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,011 ఓట్లు పడ్డాయి. 567 ఓట్ల తేడాతో గణేష్‌ విజయం సాధించారు. కల్చరల్‌ సెక్రెటరీ పోస్టుకు ఎస్‌ఎఫ్‌ఐ కూటమి అభ్యర్థి లిఖిత్‌ కుమార్‌కు 1,789 ఓట్లు పడ్డాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థి 1,318 ఓట్లు పొందారు. 471 ఓట్ల తేడాతో లిఖిత్‌ కుమార్‌ గెలుపొందారు. ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (ఇంటి గ్రేటెడ్‌) పోస్టుకు 126 ఓట్లతో షిఫా మింజ్‌, ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (రీసెర్చ్‌) పోస్టుకు 213 ఓట్లతో ఎస్‌ఎస్‌ సుభాషిణీ, ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (పీజీ) పోస్టుకు హృతిక్‌ లక్ష్మణ్‌ లలన్‌ విజయం సాధించారు. హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ఎన్ని కల్లో రెండోసారి వరుసగా ఎస్‌ఎఫ్‌ఐ కూటమి విజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు అభినందనలు తెలిపారు.
హెచ్‌సీయూ విద్యార్థి సంఘ
ఎన్నికల ఫలితాలు
అధ్యక్షులు : ప్రజ్వల్‌
ఉపాధ్యక్షులు : పృథ్వి సాయి
ప్రధాన కార్యదర్శి : కృప మరియ జార్జ్‌
జాయింట్‌ సెక్రెటరీ : కత్తి గణేష్‌
కల్చరల్‌ సెక్రెటరీ : లిఖిత్‌కుమార్‌
స్పోర్ట్స్‌ సెక్రెటరీ : సిహెచ్‌ జయరాజు
ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (ఇంటిగ్రేటెడ్‌) : షిఫా మింజ్‌
ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (పీజీ) : హృతిక్‌ లక్ష్మణ్‌
ఐసీసీ జీఎస్‌ క్యాష్‌ (రీసెర్చ్‌) : ఎస్‌ఎస్‌ సుభాషిణీ

Spread the love