1010 ఏ గ్రేడు రకాన్ని కామన్ గ్రేట్ గా తీసుకుంటున్న మిల్లర్లు

– తుమ్మల వెంకటరెడ్డి సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి
– రైతుల డబ్బులు వెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయాలి
– రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతులు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం వెయ్యి పది ఏ గ్రేడ్ రకాన్ని ఈ రోజున కామన్ గ్రేడ్గా పరిగణించి మిల్లర్లు రైతుల్ని మోసం చేస్తున్నారని సిపిఎం ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సోమలగడ్డ క్రాస్ వద్ద 163 వ జాతీయ రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేయాలంటూ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. గోవిందరావుపేట మండలంలో వెయ్యి పది రకం పెద్ద ఎత్తున రైతులు పండించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా మిల్లర్లు కింటాకు రెండు మూడు కిలో చొప్పున ధాన్యం తరుగు కటింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు .ప్రభుత్వం అధికారులు పై విషయం తెలిసినా పట్టి పట్టినట్టు వ్యవ రిస్తున్నారని పేర్కొన్నారు .ఉన్నత స్థాయి అధికారులు ఈ విధంగానే రాయమని పేర్కొన్నారని సెంటర్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ నెల రోజులైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని తిరిగి ఖరీఫ్ సీజన్లో పెట్టుబడులకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు వెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు .1010 ఏ గ్రేడ్ గా లెక్కించి ఇప్పటివరకు రైతుల పంపిన ధాన్యం మొత్తం లెక్కలు వేసి మిల్లర్లు చెల్లించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుండు రామస్వామి, ఖ్యాతం సూర్యనారాయణ ,కడారి నాగరాజు, పి నరహరి, గాదే శ్రీశైలం, గుండు లెనిన్, మహేందర్, సమ్మక్క, నరసయ్య ,గొంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love