ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌కు 14 మంది!

ట్రయల్స్‌లో ఎంపిక
హైదరాబాద్‌ : ఎలైట్‌ ఉమెన్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌కు 14 మంది క్రీడాకారిణిలు ఎంపికయ్యారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని డ్రీమ్‌ బాస్కెట్‌బాల్‌ అకాడమీలో జరిగిన పోటీల్లో 250 మంది క్రీడాకారిణులు పోటీపడ్డారు. హైదరాబాద్‌ వేదికగా నిర్వహించిన టాలెంట్‌ హంట్‌కు విశేష స్పందన లభించిందని నిర్వాహకులు సన్నీ భండార్కర్‌ తెలిపారు. త్వరలో నిర్వహించే ఎలైట్‌ ఉమెన్‌ ప్రొ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ ప్లేయర్స్‌ వేలం జాబితాలో ఈ 14 మంది ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. వేలంలోనూ మెరిస్తే.. ప్రాంఛైజీల తరఫున లీగ్‌లో బరిలోకి దిగే అవకాశం లభించనుంది.

Spread the love