Saturday, June 13, 2026
E-PAPER
Homeజాతీయంపెరిగిన ధరలు తగ్గించాలి

పెరిగిన ధరలు తగ్గించాలి

- Advertisement -

జంతర్ మంతర్ వద్ద ఐద్వా ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో పెరిగాణ ధరలు తగ్గించాలని ఐద్వా డిమాండ్ చేసింది. బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద ఐద్వా ఢిల్లీ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఎల్పిజి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పాలు, మందులు, ఎరువులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఐద్వా ఢిల్లీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆశా యాదవ్, కవితా శర్మ, ఉపాధ్యక్షురాలు ఆశా శర్మ మాట్లాడుతూ దేశంలో మహిళలపై మోడీ ప్రభుత్వం మోయలేని భారాలు వేస్తోందని విమర్శించారు. ఒక కుటుంబం గడవడానికి అవసరమైన అన్ని రకాల వస్తువుల ధరలు పెంచుతుందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు ఇతర వస్తువులపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సిఈసి సభ్యురాలు సర్బానీ సర్కార్, రాష్ట్ర కమిటీ సభ్యులు రూప, ఫరీదా, నసీమ్, పుష్ప, సీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -