Sunday, June 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ తీరు అప్రజాస్వామికం

బీజేపీ తీరు అప్రజాస్వామికం

- Advertisement -

కేంద్రం ఒత్తిడి వల్లే మీనాక్ష‍ి నామినేషన్‌ తిరస్కరించారు : టీపీసీసీ అధ్యక్షులు 
మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‌మీనాక్ష‍ి నటరాజన్‌ ‌విషయంలో బీజేపీ తీరు అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్ష‍ులు మహేశ్‌‌ కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని గాంధీభవన్‌‌లో మీడియా చిట్‌‌చాట్‌లో బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలనే కుట్రతో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌ను తిరస్కరించారని ఆరోపించారు. ప్రయివేట్‌ ‌వ్యక్తులు వేసిన కేసులో కోర్టు సాధారణ నోటీసులు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కేసులో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేయలేదనీ, కేవలం రాజకీయ ఒత్తిడి వల్లనే రిటర్నింగ్‌ అధికారి (ఆర్ఓ) నామినేషన్‌ తిరస్కరించారని అన్నారు. తాము కాంగ్రెస్‌ ‌పార్టీ పక్ష‍ాల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే కనీస స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కొంత మంది బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేసుకు సంబందించి ఎవరు లీక్‌ ‌చేశారనే విషయం విచారిస్తున్నామని చెప్పారు. ఎంతటి వారైనా పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, విలువలను తుంగలో తొక్కి తిరిగి మాపైనే బురద జల్లుతున్నారని విమర్శించారు.

అప్పడు ఓటు చోరీ ..ఇప్పుడు సీటు చోరీ బీజేపీకే సాధ్యమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరిస్తే మోడీ ప్రధాని అయ్యేవారా అంటూ ప్రశ్నించారు. బెంగాల్, మహారాష్ట్ర లో ఆ పార్టీ ఏం చేసిందో దేశ ప్రజలు చూశారని గుర్తు చేశారు. 12 ఏండ్లలో ఈ దేశానికి మోడీ చేసిందేమి లేదన్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి ‌వచ్చిందనే విషయాన్ని పవన్‌‌కళ్యాణ్‌ ‌గుర్తుంచుకోవాలన్నారు. షబ్బీర్ అలీ ఆరోపణలు పై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలపై షోకాజ్ నోటీస్‌ ఇచ్చామని తెలిపారు. ఫోర్త్ సిటీ‌ని అడ్డుకుంటామని బీఆర్‌ఎస్‌ అనడం మూర్ఖత్వమన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో జీవన్ రెడ్డిది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. అరాచకం చేసైనా అధికారంలోకి వస్తామని బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పడాన్ని తప్పు పట్టారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడున్న 8 మంది బీజేపీ ఎంపీలు కూడా ఓడిపోతారని అన్నారు. 2028లో రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారం చేపడుతుందని మహేష్‌కుమార్‌ ‌గౌడ్‌ స్పష్టం చేశారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -