ఎర్రవెల్లిలో ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల ఉమ్మడి భేటీ
హాజరు కానున్న కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సోమవారం నుంచి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ఆదివారం నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం అనంతరం రెండు గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనుందని ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారని పేర్కొంది. తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన, ఇచ్చిన హామీల అమలు, వైఫల్యాలు, 22ఏ పరిధిలోని నిషేధిత భూములు, 97 జీవో వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల ఆందోళన, కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏపీ జలదోపిడీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ, శాసనమండలిలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



