Saturday, September 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనీ డ్రామాలు సిద్దిపేట, సిరిసిల్లలో చేసుకో..

నీ డ్రామాలు సిద్దిపేట, సిరిసిల్లలో చేసుకో..

- Advertisement -

నల్లగొండలో నడవవు.. ప్రజలు తరిమికొడతారు
కేటీఆర్ పై బీర్ల ఐలయ్య ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

బీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ పాదయాత్రల పేరుతో డ్రామాలను మానుకోవాలని, వాటిని సిద్ధిపేట, సిరిసిల్లలో చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. అలాంటి చిల్లర రాజకీయాలు నల్లగొండలో చేస్తానంటే ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ పాద‌యాత్ర చేసినా,మోకాళ్ల యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా నల్లగొండ జిల్లా ప్రజలు న‌మ్మ‌బోరని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండకు ఏమీ చేయని కేటీఆర్ ఏ మొహం పెట్టుకుని మిర్యాలగూడలో రైతు సమావేశం పెట్టారని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ లోని సీఎల్పీ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో సాగ‌ర్ ఎడ‌మ కాల్వ‌ను ఆధునీక‌రించారా..? డిండి ప్రాజెక్టును పూర్తి చేశారా..? అని ప్రశ్నించారు. ఉద‌య స‌ముద్రాన్ని బీఆర్ఎస్ పదేండ్ల అధికారంలో ప‌ట్టించుకోలేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లోరైడ్, మూసీ మురికితో నల్లగొండ ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతుంటే బీఆర్ఎస్ ఏనాడు ప‌ట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పునర్జీవం చేస్తుంటే జరగకుండా పాదయాత్ర చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ‌తంలో తెలంగాణ సెంటిమెంటు తో కేసీఆర్ కోదాడ నుంచి హ‌లియా పాద‌యాత్ర చేసి ఏం సాధించారు..? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి స‌హ‌కారంతో ఉద‌య స‌ముద్రంను పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిత్యం స‌మీక్ష‌లు చేసి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ పాదయాత్ర డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో జిమ్మిక్కులు చేస్తే ప్రజలు తిరగనివ్వరనీ, తరిమికొడతారని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉందనీ, అందుకే ఉన్న నీళ్లలో తాగునీటికి ప్రాధాన్యతనిస్తున్నట్టు అయిలయ్య తెలిపారు. మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి గురించి మాట్లాడే అర్హత తండ్రి చాటున మంత్రి అయిన కేటీఆర్ కు లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిందేమి లేకున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే కేటీఆ
ర్ పాదయాత్ర చేస్తున్నారని అయిలయ్య విమర్శించారు. వెయ్యి రోజుల పాలనపై ప్రజలు సంతోషంలో ఉంటే కల్వకుంట్ల కుటుంబం బాధలో ఉందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 3,470 రోజుల ఫామ్ హౌస్ పాలన కు, కాంగ్రెస్ 1,000 రోజుల పాల‌న‌కు మ‌ధ్య తేడాను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అన్ని వర్గాల పక్కన పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి రూ.1,200 కోట్ల ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వెయ్యి రోజుల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -