కేంద్రం బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి రూ. 2లక్షల కోట్లకు పెంచాలి

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌ కష్ణయ్య
– జాతీయ బీసీ కమిషన్‌ చైర్మెన్‌కు వినతి పత్రం
నవతెలంగాణ-అడిక్‌మెట్‌
కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకో వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌.కష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జాతీయ బీస కమిషన్‌ చైర్మన్‌ హంసరాజ్‌ గం గారాంను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం కష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్ర వచ్చి 75 సంవత్సరాలు గడిచినా 56 శాతం జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం ఈ కులాల అభివద్ధి జరగడం లేదు అని తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు 2 వేల కోట్లు కేటాయించి 56 శాతం జనాభా ను అవమానించారని అన్నారు. కంద్ర బడ్జెట్‌ 45 లక్షల 50 వేల కోట్లు ఉంటే 56 శాతం జనాభా గల బీసీలకు కేవలం 2 వేల కోట్లు కేటాయించారు. ఇది ఏ మూలకు సరిపోతుంది అని ప్రశ్నించారు. ఐ.ఐ.టి – ఐ.ఐ.యం – నీట్‌ లాంటి ముఖ్యమైన కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు ఈ కోర్సుల ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నవి. ఒక లక్షా 30 వేల నుండి ఒక లక్షా 70 వేల వరకు ఫీజులు ఉన్నాయి. పైగా బీసీలకు క్రిమిలేయర్‌ ఆర్థిక పరిమితి విధించారు అత్యంత వెనకబడిన కులాల వారు సీట్లు పొందినప్పటికీ ఫీజు కట్టే స్థోమత లేక చదువును మధ్యలోనే మానుకుంటు న్నారన్నారు. పరిశ్రమలు రావడం, యాంత్రీకరణ చెందడం మూలంగా కులవత్తులు – చేతివత్తులు దెబ్బతిన్నాయన్నారు. దీనితో ఈ కుల వత్తుల వారు వత్తులు కోల్పోయి ఆకలి చావులకు గురవుతున్నారు. వీరికి ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రతీ కుటుంబానికి 10 లక్షల నుండి 50 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాజీవ్‌ ఫెలో షిప్‌ పథకం కింద అర్హులైన స్కాలర్స్‌ అందరికీ స్టై ఫండు మంజూరు చేయాలని, గురుకుల పాఠశాల, హాస్టల్‌ భవనాల నిర్మాణాలకు బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. పారిశ్రామిక పాలసీలలో, కాంట్రాక్టుల కేటాయింపులో బీసీలకు 50 శాతం కోటా ఇవ్వాలని కోరారు.బీసీల డిమాండ్లు న్యాయమైనవని ఈ డిమాండ్లు పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చైర్మన్‌ హంసరాజ్‌ గంగారాం హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ చర్చలలో, బీద మస్తాన్‌రావు, కర్రి వేణుమాధవ్‌, డాక్టర్‌ పద్మలత, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

Spread the love