ఆద్యంతం నవ్వించే టీచర్‌

ఆద్యంతం నవ్వించే టీచర్‌ఆసాంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో తెరకెక్కుతోంది ‘టీచర్‌’. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్‌కి సంబంధించిన కథతో తెరకెక్కుతోందీ చిత్రం. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్‌ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హద్యంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్‌ చేస్తుందనడంలో అసలు సందేహం లేదు. ఇటీవల 90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి వస్తోందీ చిత్రం. ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్‌ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్‌) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది. స్వాతి రెడ్డి (కలర్స్‌ స్వాతి), నిఖిల్‌ దేవాదుల (బాహుబలి ఫేమ్‌), నిత్యశ్రీ (కేరాఫ్‌ కంచరపాళెం ఫేమ్‌), రాజేంద్ర గౌడ్‌, సిద్ధార్థ్‌ (90స్‌ ఫేమ్‌), హర్ష, పవన్‌ రమేష్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం: సిద్ధార్థ్‌ సదాశివుని, ఎడిటర్‌: అరుణ్‌ తాచోత్‌, ఆర్ట్‌ డైరక్టర్‌: తిపోజి దివ్య.

Spread the love