వైన్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ – సంతోష్‌నగర్‌
బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రవీందర్‌ నాయక్‌ నగర్‌ కాలనీవాసుల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రవీందర్‌ నాయక్‌ నగర్‌ కాలనీ బంజారా వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫలకనుమా ఇన్‌స్పెక్టర్‌ ఆదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌ నాయక్‌ నగర్‌ కాలనీ ప్రెసిడెంట్‌ ఏ కష్ణనాయక్‌ మాట్లా డుతూ వైన్స్‌ యాజమాన్యం సహకారంతో రవీంద్ర నాయక్‌ నగర్‌ కాలనీలో కొంతమంది బెల్టుషాపులను విచ్చల విడిగా నడిపిస్తున్నారని ఆరోపించారు. కాలనీలోకి బయటివారు ఎక్కువ మంది రావడం, వాహనాల రద్దీ పెరగడంతో స్థానికంగా ఉన్న మహిళలు, చిన్న పిల్లలు, యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయాన్ని ఎక్సైజ్‌ అధికారుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కొన్ని సందర్భాలలో ఇతర కమ్యూనిటీ వాళ్లు కాలనీ ప్రజలపై దాడులు కూడా చేశారని చెప్పారు. కానీ బెల్టుషాపుల ఆగడాలు మాత్రం ఆగడం లేదన్నారు. ఇప్పటికైనా వెంటనే బెల్టుషాపు నిర్వా హకులపై, వెన్స్‌ యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. వినతి అందజేసిన వారిలో రవీందర్‌ నాయక్‌ నగర్‌ కాలనీవాసులు కిషన్‌, రాజేష్‌, రాజ, నరేందర్‌, మహేష్‌ ,వినోద్‌, వికాస్‌ ఉన్నారు.

Spread the love