Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు: తహసిల్దార్

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు: తహసిల్దార్

- Advertisement -

మూడు హిటాచి వాహనాలు సీజ్ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

ప్రభుత్వ నుండి అనుమతులు లేకుండా దుందిబి పరిసరాల ప్రాంతాల నుండి ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో దుందిబి నదిలో అనుమతి లేకుండా ఇసుకను హిటాచిలతో తోడుతుండడంతో ప్రజలు సమాచారం అందించడంతో దుందిబి నదిని  ఎస్సై శ్రీనివాస్ తో కలిసి సంఘటన చేరుకొని మూడు హిటాచి అహనాలను సీజ్ చేసి పోలీసులకు అప్పజెప్పినట్లు ఆయన చెప్పారు .

 వాగు వద్ద సరిహద్దు సమస్య పరిష్కారం కాకముందే హిటాచి యంత్రాలతో ఇసుక తీయడంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తక్షణం చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో  పరిశీలించి నిబంధనలకు విరుద్ధ పనిచేస్తున్న హిటాచిలను పోలీసులకు అప్పజెప్పినట్లు ఆయన తెలిపారు. తహసిల్దార్ వెంబడి మండల గిరిధవరి అంబికా వసంత్, జిపిఓ కొండయ్య, రైతులు శ్రీశైలం గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -