Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖరీఫ్ సాగు ఖరారు.!

ఖరీఫ్ సాగు ఖరారు.!

- Advertisement -

మండలంలో పంటల విస్తీర్ణం 21,500 వేల ఎకరాలు
అత్యధికంగా వరి వైపు మొగ్గు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఖరీఫ్ సాగు ప్రణాళికను వ్యవసాయ సిద్ధం చేసింది.ఈ ఏడాది మండలంలో ఆయా రకాల పంటలు మొత్తం 21,500 వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు.ఇందులో అత్యధికంగా వరి 16,000 వేల ఎకరాలు కాగా,రెండో స్థానంలో పత్తి 3,500 వేల ఎకరాల్లో మిర్చి 2000 వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు ప్రకటించారు.గత మూడేళ్లలో వరితో పాటు అన్నిరకాల పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ అంచనా వేసింది.ఇందు కోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు.అవసరమైన విత్తనాలు  వరి 400 క్వింటాళ్ళు,పత్తి 42 క్వింటాళ్లు అవసరం అని అంచనా వేశారు.మండలంలో ఎరువుల వినియోగం వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.యూరియా 3,150 మెట్రిక్ టన్నులు,డిఏపి 990 మెట్రిక్ టన్నులు,ఎంఓపి 744 మెట్రిక్ టన్నులు,కాంప్లెక్స్ ఎరువులు 5,056 మెట్రిక్ టన్నులు. 

వ్యవసాయమే ఆధారం..

మండలంలో ఏటా రెండు పంటలు సాగు చేస్తారు. ఏకైన చిన్న తరహా ప్రాజెక్టు ఎడ్లపల్లిలోని బొగ్గుల వాగు,కాపురం చెరువు తోపాటు చేరువులు,కుంటలు, బోర్ బావులు,మానేరుపై ఆధారపడుతున్నారు. వానాకాలంలో ప్రధానంగా వరి,పత్తి,మిర్చి పండిస్తుంటారు. అయితే మండలంలో రైతులు అత్యధికంగా సన్న వడ్ల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం సైతం బోనస్ ఇస్తుండ టంతో గత మూడేళ్లుగా రైతులు వరి సాగు చేస్తు న్నారు. ప్రభుత్వ మద్దతుతో పాటు బోనస్ లభిస్తుం డటంతో ఈ ఏడాది సన్నాల సాగు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా వ్యవసాయ అధికారులు సైతం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాగుతుండగా, మరోవైపు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -