అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి ఇక 3.5 గంటల్లోనే

నవతెలంగాణ – అహ్మదాబాద్ : అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి  బుల్లెట్ రైలు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైల్లో ప్రయాణానికి సుమారు 12 గంటలు పడుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తైతే ఆ సమయం కాస్తా 3.5 గంటలకు తగ్గిపోనుంది. ఎలివేటెడ్ కారిడార్‌లో సగటున గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించడానికి సాధ్యమవుతుంది. ఈ మేరకు రైల్వే శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రతిపాదిత బుల్లెట్ రైలు హిమ్మత్‌నగర్, ఉదయ్‌పూర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, అజ్మీర్, కిషన్‌గఢ్, జైపూర్, రేవారీ, మనేసర్ స్టేషన్ల మీదుగా వెళ్తుంది.

 

Spread the love