20 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు…

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైన మంగళవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.ఈసందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు, నాతోటి ఉపాధ్యాయులు ఒకేవేధిక మీద కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మర్చిపోకుండా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ ఒకే వేదిక మీద కలిసేలా చొరవ చూపిన పూర్వ విద్యార్థి శ్రీనివాస్ గౌడ్, మిగతా విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజులు, శంకర్ గౌడ్, శ్రీదర్ రెడ్డి, మహేశ్వర్, ఉమాదేవి, పూర్వ విద్యార్థులు మోత్కూరు శ్రీనివాస్ గౌడ్, బుట్టి రమేష్, రియాజ్, శివ, అవుసుల నవీన్, రాజ్ కుమార్, రాజ్ గణేష్, స్వామి, పాశం అశోక్, నాగభూషణ్, హరిష్, గణేష్, నవీన్, ప్రవీణ్, నరేష్, టీ.అశోక్, స్వప్న, సాధన, జమున, సుజాత, తదితరులు ఉన్నారు.

Spread the love