మరో 5 రోజులు భానుడి భగభగలే: ఐఎండీ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. జూన్‌ నెల సగం గడిచినా పగటి ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు కూడా ఎండలు మండిపోతాయని భారత వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటించింది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, కోస్తాంధ్రాల్లో రాబోయే ఐదు రోజులపాటు ఎండలు మండిపోతాయని తెలిపింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌ దక్షిణ భాగంలోని వేర్వేరు ప్రాంతాల్లో, పశ్చిమబెంగాల్‌లోని గంగానది పరిసర ప్రాంతాల్లో, బీహార్‌, జార?ండ్‌ రాష్ట్రాల్లో కూడా మరో ఐదు రోజులపాటు ఇప్పటిలాగే ఎండలు కొనసాగుతాయని పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో మరో రెండు రోజులు భానుడి ప్రతాపం కొనసాగుతుందని ఐఎండీ చెప్పింది.

Spread the love