జిల్లాకు వ్యయ, జనరల్‌, పోలీస్‌ పరిశీలకుల నియామకం

– మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ గౌతమ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
మల్కాజిగిరి-07 పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల నిర్వహణలో భాగంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు ఎన్నికల కమిషన్‌ వ్యయ, జనరల్‌, పోలీస్‌ పరిశీలకులను నియమించినట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. వ్యయ పరిశీలకులైన మనోజ్‌ అలోయిస్‌ లక్రా, ఐఆర్‌ఎస్‌, ధవ్‌ భోళా, ఐఏ అండ్‌ ఏఎస్‌, జనరల్‌ అబ్జర్వర్‌గా డాక్టర్‌ ఎం.ఎస్‌.ప్రియాంక శుక్లా ఐఏఎస్‌, పోలీస్‌ ఆబ్జర్వర్‌ డాక్టర్‌ రామేశ్వర్‌ సింగ్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఎన్నికల అంశాలపై ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకులకు సలహాలు, సూచనలు, ఫిర్యాదులు చేయాలనుకునేవారు ఈ ఫోన్‌ నెంబర్లను సంప్రదించవచ్చును. వ్యయ పరిశీలకులు మనోజ్‌ అలో ఈస్‌ లక్రా ఫోన్‌:7337047775, ధ్రువ భోళా ఫోన్‌: 7337047778, జనరల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌ ప్రియాంక శుక్లా ఫోన్‌: 7337047776, పోలీస్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ రామేశ్వర్‌ సింగ్‌, ఫోన్‌: 7337209990 ఫోన్‌ నెంబర్‌లు అందుబాటులో ఉంటాయని తెలిపా రు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. వీరికి కలెక్టరేట్‌లోని మొదటి అంతస్తులు ఎఫ్‌-26లో జనరల్‌, వ్యయ, పోలీస్‌ అబ్జర్వర్‌ అందుబాటులో ఉంటారని తెలిపారు. జనరల్‌ అబ్జర్వర్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌ ప్రియాంక శుక్లా ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పరిశీలకులకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వివరించారు. జిల్లా నుంచి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ, జనరల్‌, పోలీస్‌ పరిశీలకులు పరిశీలిస్తారని, ఎన్నికలు ముగిసేంత వరకు వీరు జిల్లాలోనే అందుబాటులో ఉంటారని తెలిపారు.

Spread the love