మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

– అభివృద్ధి పథకాలను వివరించాలి
– పట్నం సునీతారెడ్డి
– అంబేద్కర్‌ నగర్‌లో ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-జవహర్‌నగర్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని, మరోసారి మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామని ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం జవహర్‌ నగర్‌ మున్సిపల్‌ పరిధిలోని అంబేద్కర్‌ నగర్‌లో మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి తోటకూర జంగయ్య యాదవ్‌తో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివద్ధి పథకాలను ప్రజలకు వివరించి, చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జవహర్‌ నగర్‌ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్‌ యాదవ్‌, మేయర్‌ దొంతగాని శాంతి కోటేష్‌ గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రెడ్డి శెట్టి శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకులు శంకర్‌ గౌడ్‌, సదానంద్‌, స్థానిక కార్పొరేటర్లు నిహారిక గౌడ్‌, బల్లి రోజా, కోఆప్షన్‌ సభ్యులు మహమ్మద్‌ ఫారూఖ్‌, అంబేద్కర్‌ నగర్‌ నాయకులు కాయిత రాజు యాదవ్‌, అబ్బగోని పుష్ప, బొబ్బిలి మంజుల, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కాప్రాలో..
మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేంద ర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆమె కుమార్తె పట్నం మనీషారెడ్డి, చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవి యాదవ్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. బుధవారం కుషాయిగూడ పరిధిలోని జమ్మిగడ్డ, నెహ్రునగర్‌, భరత్‌ నగర్‌, న్యూ విరాట్‌ నగర్‌లో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి పట్నం సునీతామహేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారని, ప్రచారానికి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాసుల పోచయ్య గౌడ్‌, నాగిళ్ల బాల్‌రెడ్డి, అంజిరెడ్డి, బత్తుల శ్రీకాంత్‌ యాదవ్‌, గంగాధర్‌, పొన్నాల రమేష్‌, బాల్‌ నర్సింహ శ్రీనివాస్‌ గౌడ్‌, మేకల రాజేష్‌, జెకె కాలనీ రమేష్‌, క్రాంతి, భాను, అరుణ్‌, రాము, వెంకటేష్‌, బబ్లూ, మహేష్‌, రాజు, నరసింహ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, శివమ్మ, నిర్మల, భాగ్యమ్మ, నవనీత, రామ రెడ్డి, సంధ్య, గిరిజ, శిరీష, పాల్గొన్నారు.
సాయిబాబా నగర్‌లో..
కాంగ్రెస్‌ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్‌ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి ఆదేశాననుసారం కాప్రా డివిజన్‌ సాయిబాబా నగర్‌లో కాంగ్రెస్‌ నేతలు ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ స్వర్ణరాజు శివమణి, డివిజన్‌ అధ్యక్షుడు కొబ్బరి నాగ శేషు, ఇన్‌చార్జి సీతారాంరెడ్డి, ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ వినోద్‌, ఓబీసీ చైర్మెన్‌ జగదీష్‌, యూత్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ గౌడ్‌, విఠల్‌ నాయక్‌, నాగరాజు, సత్యనారాయణ, ఆడేపు శ్రీనివాస్‌, సతీష్‌ యాదవ్‌, నాగరాజు, శ్రీధర్‌ రెడ్డి, శ్యామ్‌ చారి, షాబుద్దీన్‌, శ్రీకాంత్‌, సుమన్‌, మల్లారెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, ఇమ్రాన్‌, జీవన్‌, హరిఫుద్దీన్‌, సురేందర్‌ రెడ్డి, రాజన్‌, ప్రదీప్‌, ఎండీ ఆలీ, షాదుల్లా, సంతోష్‌ చారి, కార్యకర్తలు ఉన్నారు.
అల్వాల్‌లో..
పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా అల్వాల్‌ పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ ప్రచారం మచ్చ బొల్లారం మహాత్మాగాంధీ నగర్‌ నుంచి కష్ణానగర్‌, చంద్రానగర్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డివిజన్‌ కార్పొరేటర్‌ రాజ్‌జితేందర్‌ నాధ్‌, నాయకులు సంపత్‌ యాదవ్‌, కార్యకర్తలు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

Spread the love