సమాచార హక్కు చట్టం 2005 ఆధ్వర్యంలో అవగాహనసదస్సు

నవతెలంగాణ -పెద్దవూర
సమాచార హక్కు వికాస సమితి  నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన సదస్సు ఈ నెల 31న అనుముల మండలం హలియా పట్టణ కేంద్రంలో మధ్యాహ్నం ఒకటి గంట నుండి మూడు గంటల వరకు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని వ్యవస్థాపక అధ్యక్షులు యారమాద కృష్ణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు  నల్గొండ జిల్లాలోని జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, మండలాల కమిటీల సభ్యులు, ఆయా కమిటీల బాధ్యులు,ప్రతి సభ్యుడు  సమయానికి హాజరుకావాలని తెలిపారు.మీ పరిధిలోని సభ్యులందరికీ ఫోన్ చేసి మాట్లాడి హాజరయ్యేలా చూడాలని కోరారు.అదేవిదంగా సమాచార హక్కు వికాస సమితిలో సభ్యత్వం ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు,సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపకులు డాక్టర్ యర్ర మాద కృష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా ఆర్టిఐ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్, జిల్లా ప్రథాన కార్య దర్శి చిత్రం శ్రీనివాస్,జిల్లా కమిటీ ముఖ్యులు హాజరువుతున్నందున సభ్యులు అందరూ తప్పని సరిగ్గా సభ్యులు  సమయానికి హాజరు కావాలని తెలిపారు.ఈ సమావేశం హాలియా మండల కేంద్రం లో రిటైర్డ్ ఉద్యోగులు భవనము, దేవరకొండ రోడ్,కాలువ సాగర్ ఎడమ కాలువ ప్రక్కన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Spread the love