తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల తగ్గింపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి: తాటికొండ సీతయ్య

నవతెలంగాణ – తుంగతుర్తి
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలను తగ్గిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.చిన్న జిల్లాల ద్వారానే ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందని,కార్యాలయాలు ప్రజల సమీపానికి వస్తాయని కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.జిల్లాల ఏర్పాటు ద్వారానే పాలనాపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలంగాణలో కొత్త జిల్లాల ద్వారా ప్రజలు ఎంతో లబ్ధి పొందారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జిల్లాల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేని ఎడల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Spread the love