సైబర్ నేరాలపై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండాలి..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
సమాజంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నా యని,వాటిని నివారించేం దుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్ర త్తలు తీసుకుంటూ పోలీసుల సూచనలు పాటించాలని సుల్తాన్ బజార్ డివిజన్ ఏసీపీ శంకర్ అన్నారు. కోఠిలోని తెలంగా ణ మహిళా విశ్వ విద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఎంబీఏ, ఎంఎస్సీ,కంప్యూటర్ సైన్స్ విభాగాలకు చెందిన విద్యార్థిను లకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సైబర్ నేరాలను పరిశీలించడంతో పాటు అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించా లని అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన జార్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసాచారి, ఎస్ ఐలు కిరణ్ కుమార్ రెడ్డి, సతీశ్, మధుసూదన్,  అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love