వాస్తవ సంఘటన ఆధారంగా అంతం కాదిది ఆరంభం

           క్రసెంట్‌ సినిమాస్‌, కష్ణ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నూతన దర్శకుడు ఇషాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’. పవర్‌ఫుల్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రభు పౌల్‌రాజ్‌, సిరాజ్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు దశరథ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘తమిళ నాడులోని పొల్లాచ్చిలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అమ్మాయిలను ట్రాప్‌ చేసి, వాళ్ల నగ వీడియోలను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేసిన వ్యక్తిని బాధిత అమ్మాయిలు ఎలా పట్టుకున్నారు అనేదే ఈ చిత్ర కథ. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కరెంట్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకుని తీశారు. టైటిల్‌ బాగుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి’ అని చెప్పారు. ‘కష్ణ మీద అభిమానంతో మా సినిమాకి ఈ టైటిల్‌ పెట్టాం. ఎక్కడా రాజీ పడకుండా తీశాం. మహిళలపై అత్యాచారాలకి పాల్పడే వారికి ఈ చిత్రం ఓ మేసేజ్‌ ఇస్తుంది. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా హీరో, దర్శకుడు ఇషాన్‌ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారు’ అని నిర్మాత సిరాజ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వినోద్‌ యాజమాన్య, లిరిక్‌ రైటర్‌ రాంబాబు గోసాల, హీరోయిన్స్‌ శక్తి మహీంద్రా, నిష్మా, షేర్‌ స్టూడియో అధినేత దేవీ ప్రసాద్‌, గీతా సింగ్‌, ఖాదర్‌ గౌరీ, వైష్ణవి, నాగ మధు తదితరులు పాల్గొన్నారు.

Spread the love