వతెలంగాణ – ఢిల్లీ: ఓ ప్రైయివేటు పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సౌత్ ఢిల్లీలోని పుష్పవిహార్ ప్రాంతంలోగల అమృత పాఠశాలకు మంగళవారం ఉదయం 6:33 గంటల ప్రాంతంలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. పోలీసులు, బాంబు స్వ్కాడ్ పాఠశాలకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.