Saturday, May 23, 2026
E-PAPER

భేష్..

- Advertisement -

నిమ్స్‌‌లో విజయవంతంగా
2 వేల కిడ్నీ మార్పిళ్లు

దక్ష‍ిణాదిలో నెంబర్‌‌వన్‌‌
సిబ్బందికి సీఎం రేవంత్‌‌రెడ్డి అభినందనలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్‌) కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది. ఆ ఆస్పత్రి యూరాలజీ విభాగం ఇప్పటివరకు రెండు వేల కిడ్నీ మార్పిడిలను పూర్తి చేసింది. ఈ విషయంలో దక్షిణ భారత దేశంలోనే నిమ్స్​ నెంబర్ వన్​గా నిలిచింది. దేశంలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్​లో గుజరాత్​లోని ఐకేడీఆర్‌సీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్‌లో లూథియానా క్రిస్టియ‌న్ కాలేజీలో ఉండగా.. నిమ్స్ మూడో స్థానంలో ఉంది. ఈ అరుదైన మైలురాయిని సాధించి కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ 2,000 మందిలో 1,900 మంది(95 శాతం మంది) రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవటం విశేషం. 2023 జనవరి నుంచి గడిచిన మూడు ఏండ్ల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు చేసి రికార్డు నెలకొల్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -