సి-విజిల్‌’ను సద్వినియోగించుకోండి

– పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి
– పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లింగ్యా నాయక్‌
నవతెలంగాణ-కొడంగల్‌
ఎంపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిం చేందుకు ప్రజలు సి-విజిల్‌ యాప్‌ను సద్విని యోగించుకోవాలని రిటర్నింగ్‌ అధికారి లింగ్యా నాయక్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కొడంగల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మండల తహసీల్దార్‌ విజరుకుమార్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, భయభ్రాంతులకు గురిచేసినా, బలవంతంగా ప్రభావితం చేసినా సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా సరే సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరించ నున్నట్టు తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ప్రజల చేతిలో సి-విజిల్‌ అనే బ్రహ్మాస్త్రం పెట్టిందని, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉన్న వారెవరైనా ఈ యాప్‌ను ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సమ స్యను ఎప్పటి కప్పుడు కెమెరా ఆన్‌ చేసుకుని ఫొటో లేదా వీడియో తీసి సమస్యను సంక్షిప్తంగా టైప్‌ చేసి పంపించాలన్నారు. సి-విజిల్‌ ద్వారా చేసే ఫిర్యాదు దారుల పేర్లు గోప్యంగా ఉంచనున్నట్టు తెలిపారు. ఈ యాప్‌ సురక్షితమైనదని, దీనిని ఆపరేటింగ్‌ కూడా చాలా సులువుగా చేయ వచ్చన్నారు. ఇంగ్లీష్‌, తెలుగులో సమస్యను పంపించవచ్చన్నారు. పార్ల మెంటు ఎన్నికల నేప థ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. 188,197,246, 248, 253,234,269 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. నూతనంగా బోంరాస్‌ పేట్‌ మండలంలో మదనపల్లితండా, హంసన్‌పల్లి, కొడంగల్‌ మండలంలోని బీసీ బాలుర వసతి గృహం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాల పాత కొడంగల్‌, పోచమ్మ కుంటతండా, బోయపల్లి, భవనమ్మ తండా, పలుగురాళ్ల తండాలలో నూతన పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పోలింగ్‌ రోజున ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు అన్ని ఏర్పాట్టు చేయాలని ఆదేశించారు. వికలాంగుల కోసం ర్యాంపు, అన్ని కేంద్రాల్లో వెలుతురు కోసం లైటింగ్‌, ఫ్యాన్లు, ఫర్నిచర్‌, తాగునీరు, మరుగుదొడ్లు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు శంకర్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు నవాజ్‌. ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి. గుల్షన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love