హెచ్‌సీయూలో భౌతిక దాడులను అరికట్టాలి

– హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక
నవతెలంగాణ-మియాపూర్‌
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో భౌతిక దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏఎస్‌ఏ, బీ ఎస్‌ఎఫ్‌, డీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూ ఐ, టీఎస్‌ఎఫ్‌, ఎంఎస్‌ఎఫ్‌, ఏఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు నిరసనా కార్యక్రమాన్ని చేప ట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో సెంట్రల్‌ యూనివర్సిటీ అధ్యక్షులు అతిక్‌ హైమద్‌, ప్రధాన కార్యదర్శి కృప మాట్లా డుతూ..కొన్నేండ్లుగా హైదరాబాద్‌ సెం ట్రల్‌ యూనివర్సిటీ గ్లోబల్‌ ర్యాంకింగ్‌లో ముందు వరు సలో ఉంటుందని వారు తెలిపారు. ఇలాంటి యూనివర్సిటీలో కొంతమంది మతోన్మాద ఏబీవీపీ ఆలోచనతో విద్యార్థులను వారి అకాడమిక్‌, నైపు ణ్యాన్ని అడ్డుకుంటూ విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతుందని వారు ఆరోపించారు. కొద్ది ఏండ్లుగా అనేక ఎలక్షన్స్‌లో ఏబీవీపీ ఓటమిపాలవుతుందని వారు తెలిపారు. ఓటమిని జీర్ణించుకోలేని ఆ సం ఘానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు విద్యార్థులపై దాడులు చేస్తూ క్యాంపస్‌లో అలజడి సృష్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సమస్యలపై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యార్థి సంఘాలను భౌతికంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఇందులో భాగం గానే కొద్ది రోజుల క్రితం క్యాంపస్‌లో ఫేర్వెల్‌ పార్టీ కమి టీ మెంబర్ను సైతం భౌతికంగా దాడి చేసి గాయ పరచాలని వారు తెలిపారు. ఈ విషయంపై క్యాం పస్‌లో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికైన వ్యక్తి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై కూడా దాడి చేశారని గుర్తుచేశారు. గుం పులు గుంపులుగా వచ్చి సామాన్య విద్యార్థులను సైతం దాడి చేయడమే కాకుండా గాయపడిన విద్యార్థిని హాస్పిటల్‌కి తీసుకెళ్తంటే అంబులెన్స్‌ను సైతం అడ్డుకున్నారని వారు తెలిపారు. ఇలాంటి ఘటనపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ యాజమాన్యానికి చెప్పినప్పటికీ మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి క్యాంపస్‌ లో అలజడి సృష్టిస్తున్న వ్యక్తి తనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శివ, మోతిన్‌ అఖిలపక్ష విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Spread the love