సీఎంను కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌

– త్వరలో కాంగ్రెస్‌లోకి.. ?
– కార్యకర్తలతో చర్చించిన  అనంతరం నిర్ణయం: ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. బీఆర్‌ఎస్‌ కంచుకోటగా ఉన్న రాజేం ద్రనగర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇం టికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రభుత్వ సలహా దారులు నరేందర్‌ రెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ ఫయుంతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌లో చేరడా నికి ముఖ్యమంత్రితో చర్చించారు. రాబోయే పా ర్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ను కైవసం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దష్టి పెట్టారు. అందులో భాగంగానే చేవెళ్ల పార్ల మెంట్‌ పరిధిలో ఉన్న రాజేంద్రనగర్‌ నియోజక వర్గం ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌లోకి చేర్చుకోవడానికి చర్చలు జరిపారు. ప్రకాష్‌ గౌడ్‌పార్టీలో చేరితే చేవె ళ్ల పార్లమెంట్లో కాంగ్రెస్‌ విజయం సాధించే అవ కాశాలు ఎక్కువగా ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మొదటి నుంచి రాజేంద్రనగర్‌ నియో జకవర్గంపై ప్రత్యేక దష్టి పెట్టి ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ని పార్టీలోకి ఆహ్వానించారు. విశ్వసనీయ సమాచారం మేరకు రెండు రోజుల్లో ఎమ్మెల్యే ప్రకా ష్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం.
కార్యకర్తలు చర్చించిన అనంతరం నిర్ణయం: ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌
కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో భాగంగా ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ శుక్రవారం సా యంత్రం తన నివాసంలో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవం త్‌ రెడ్డి ఫోన్‌ చేయడంతోనే నేను ఈరోజు ఇంటికి వెళ్లి రేవంత్‌ రెడ్డి కలిశాను. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం కృషి చేయా లని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. అయితే కార్యక ర్తలతో చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని చె ప్తానని సీఎం రేవంత్‌ రెడ్డికి చెప్పాను. నియోజ కవర్గ అభివద్ధి కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను.

Spread the love