ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు

నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఎస్పీ డాక్టర్‌.వినీత్‌ చేతుల మీదుగా టేకులపల్లి సీఐ ఇంద్ర సేనారెడ్డి, ఆళ్ళపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై ఈ.రతీష్‌, ఎఎస్‌ఐ వెంకట్‌ రెడ్డి ప్రశంస పత్రాలు అందు కున్నట్లు గురువారం స్థానిక ఠాణాలో వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో పూల మొక్కల పెంపకం, కేసుల పరంగా వచ్చిన వాహనాలను సక్రమంగా ఉంచడం, ఆయుధాలను రక్షణ గదిలో పరిశుభ్రంగా భద్రపరచడం, రికార్డులు, రిజిస్టర్‌లను సవ్యంగా ఉంచడం, తదితర అంశాల (ఫైవ్‌ వర్టికల్స్‌) విభాగంలో ఎస్పీ ప్రశంస పత్రాలు ఇచ్చారని చెప్పారు.

Spread the love